Breaking News

భారత్‌లో రూ.46000 కోట్ల పెట్టుబడి: సింగపూర్ కంపెనీ

Published on Fri, 09/06/2024 - 07:16

ముంబై: అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్, సింగపూర్‌కు చెందిన ‘క్యాపిటాల్యాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ (సీఎల్‌ఐ).. భారత్‌లో తన నిర్వహణలోని ఫండ్‌ (ఎఫ్‌యూఎం) విలువను 2028 నాటికి రెట్టింపు చేసుకోన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎఫ్‌యూఎం 7.4 బిలియన్‌ సింగపూర్‌ డాలర్లు (రూ.46,000 కోట్లు)గా ఉంది. 30 ఏళ్ల క్రితం ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకుంది.

హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో 40 ఐటీ, బిజినెస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌  పార్క్‌లు, డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఐటీ పార్క్‌లు, లాజిస్టిక్స్‌ పార్క్‌ల వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు.. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘భారత్‌ మాకు వ్యూహాత్మక మార్కెట్‌. మా మొత్తం వ్యాపారంలో కీలక వాటాను ఆక్రమిస్తోంది.

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లో గడిచిన ఏడేళ్లలో మా పెట్టుబడులు మూడింతలయ్యాయి. 2024లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ సంస్థలు, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లను భారత్‌లో నాణ్యమైన రియల్‌ అసెట్స్‌ ఆకర్షిస్తున్నాయి’’అని సీఎల్‌ఐ గ్రూప్‌ సీఈవో లీచీ కూన్‌ తెలిపారు. భారత మార్కెట్‌లో తమకు ఎంతో అనుభవం కలిగి ఉండడంతో ఈ అవకాశాలను సొంతం చేసుకోగలమని.. తమ నిర్వహణలోని నిధిని 2028 నాటికి 7.4 బిలియన్‌ డాలర్లకు పెంచుకుంటామని చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)