Breaking News

నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యం

Published on Thu, 12/19/2024 - 08:33

న్యూఢిల్లీ: దేశంలోని 100 అగ్రగామి కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలో ఇది గణనీయంగా మెరుగుపడినట్టు ‘ఎక్స్‌లెన్స్‌ ఎనేబులర్స్‌’ 5వ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సర్వే వెల్లడించింది. 2024 మార్చి నాటికి కేవలం ఐదు కంపెనీల్లోనే మహిళా స్వతంత్ర డైరెక్టర్‌ ఒక్కరూ లేని పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. ఇవన్నీ ప్రభుత్వరంగ సంస్థలే (పీఎస్‌యూ) కావడం గమనార్హం. నాలుగు పీఎస్‌యూలతోపాటు, ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌లో మహిళా డైరెక్టర్‌ ఒక్కరూ లేరు.

2021 మార్చి నాటికి అగ్రగామి 100 కంపెనీల్లో మహిళా ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ లేని కంపెనీలు 21 ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ అయినా ఉండాలని కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 149 నిర్దేశిస్తోంది. సమర్థత కలిగిన మహిళలను గుర్తించి, కెరీర్‌ పురోగతి దిశగా అవకాశాలు కల్పించడం ద్వారా బోర్డుల్లో ప్రాతినిధ్యాన్ని పెంచగలమని ఈ సర్వే అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్‌

నిదానంగా పురోగతి..

కంపెనీ బోర్డుల్లో కీలక పదవుల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2021 మార్చి నాటికి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్లు కలిగిన కంపెనీలు రెండు ఉంటే, 2024–25 మార్చి నాటికి ఐదుకు పెరిగినట్టు తెలిపింది. అలాగే, 2021 మార్చి నాటికి రెండు కంపెనీలకు మహిళా ఛైర్‌పర్సన్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఐదుగురు ఈ స్థానానికి చేరుకున్నట్టు వెల్లడించింది. నాయకత్వ బాధ్యతల్లో మహిళల పాత్ర గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్లు తెలిపింది. లింగ సమానత్వం మెరుగ్గా లేకపోయినప్పటికీ.. కీలకమైన పాలన బాధ్యతల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పేర్కొంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)