Breaking News

''అతడు గెలిచాడు.. నేను విడాకులు తీసుకున్నాను''

Published on Fri, 08/23/2024 - 14:35

ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీలోని ఉన్నతోద్యోగులు మంచి నడవడిక కలిగినవారైతే.. ఇతర ఉద్యోగులు కూడా వారిని అనుసరించవచ్చు. కానీ ఉన్నతోద్యోగులు చెడ్డవారైతే? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని రిటైర్డ్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ 'ఏతాన్ ఎవాన్స్' వెల్లడించారు.

అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టాడని, దీంతో వారిరువురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని 'ఏతాన్ ఎవాన్స్' (Ethan Evans) పేర్కొన్నారు. ఈ విషయంలో అతడు గెలిచాడు, నేను విడాకులు తీసుకున్నానని అన్నారు. పని విషయంలో సీఈఓను వ్యతిరేకించిన కారణంగా.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే నెపంతో తన భార్యను ప్రలోభపెట్టారని లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు.

అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెజాన్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ సమయంలోనే ఉద్యోగం వదిలేసి ఉంటే చాలా బాగుండేదని ఆయన అన్నారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు.

ఏతాన్ ఎవాన్స్ టిప్స్
➡మీరు పనిచేసే కంపెనీలో మేనేజర్‌ మంచి వారైతే.. వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోండి. 
➡పాములను గుర్తించండి (చెడ్డవారిని గుర్తించండి).
➡సంస్థలో ఉన్నతోద్యోగులు చెడ్డవారని తెలిసినప్పటికీ.. మీ పని మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోండి.
➡చెడ్డవారిని నేరుగా ఎదుర్కోవద్దు.
➡చెడ్డవారిని ఎదుర్కోవడానికి మీరు కూడా పాములా మారకండి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)