Breaking News

ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..!

Published on Wed, 03/22/2023 - 12:25

తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్‌ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్‌గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్‌సైట్ (news.com.au) నివేదించింది.

ఇదీ చదవండి: సైబర్‌ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్‌ సెక్యూరిటీ కీలక సర్వే

అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో అందుకున్న 50 నెలల బోనస్‌తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్‌ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత  పనితీరు ఆధారంగా ఉంటున్నాయి.

ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్‌.. కీలక బాధ్యతలపై చర్చలు! 

ఈ ఎవర్‌గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్‌లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇదీ చదవండి: హౌసింగ్‌ బూమ్‌..  బడ్జెట్‌ ఇళ్లకు బాగా డిమాండ్‌

ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్‌గ్రీన్‌ 16.25 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)