Breaking News

EVE: రుచికరమైన వంటలు చేసే రోబో!

Published on Thu, 01/25/2024 - 21:12

ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో రోబోల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. మనుషులతో మరమనుషులు కలిసి మనుగడ సాగించే రోజులు వస్తున్నాయి. ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, షాపింగ్, ఇంటిని కాపలా కాయడం.. ఇలాంటి పనులన్నీ చకచకా చేసేసే హ్యూమనాయిడ్‌ రోబో వచ్చేసింది.

మానవ సమాజంతో మసలుకుంటూ వారికి అవసరమైన పనులన్నీ చేసి పెట్టే హ్యూమనాయిడ్‌ రోబోను 1X అనే నార్వేజియన్ కంపెనీ రూపొందించింది. దీని పేరు ఈవ్‌ (EVE).  ఇది మనిషిలా కనిపిస్తుంది.. కదులుతుంది.  ఇంకా ఇది ఏమేం పనులు చేయగలదు.. దీని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం..

ఈవ్‌ ప్రత్యేకతలు
ఈవ్‌ ఒక అధునాతన హ్యూమనాయిడ్‌ రోబో.  మనిషిలాగే కనిపిస్తుంది.. కదులుతుంది. అనేక ఫీచర్‌లు దీని సొంతం. పరిసరాలను గ్రహించడానికి, స్పందించడానికి చాలా కెమెరాలు, సెన్సార్‌లు ఉంటాయి. ఈవ్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు, సుమారు 87 కేజీ బరువు ఉంటుంది. దీనికి ఉన్న చక్రాలతో గరిష్టంగా గంటకు 9 మైళ్ల వేగంతో కదులుతుంది. గ్రిప్పర్ చేతులతో సుమారు 15 బరువును మోసుకెళ్లగలదు. ఒక గంట ఛార్జ్‌తో ఆరు గంటలు పనిచేస్తుంది.

 

రుచికరంగా వంటలు
ఈవ్‌ స్మార్ట్‌, ఆండ్రాయిడ్‌ రోబో. వివిధ రకాల పనులను చేయడానికి చాట్‌జీపీటీ మాడిఫైడ్‌ వర్షన్‌ జీపీటీ-4 ఉపయోగిస్తుంది. ఇది మీరు చెప్పిన, మీకు నచ్చిన  వంటకాలను రుచికరంగా చేసి వడ్డిస్తుంది. వంట చేసేందుకు ముందుగా కిచెన్‌లోని షెల్ఫ్‌లను స్కాన్ చేస్తుంది. ఏమేం పదార్థాలు, దినుసులు ఉన్నాయో గుర్తించి వాటితో రుచికరమైన వంటలు తయారు చేస్తుంది. ఇందుకోసం GPT-4V సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. అంటే వంటలో ఏది ఎంత వేయాలో అంత వేసి నోరూరించే పదార్థాలు చకచకా చేసేస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)