Breaking News

షాకింగ్‌ న్యూస్‌: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ చేస్తే..

Published on Sat, 07/22/2023 - 16:16

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్‌ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్నుతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయి. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది.

ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా సేవల సరఫరాగా పరిగణిస్తారా అనే సమస్య ప్రాథమికంగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ని విద్యుత్‌ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ ముందున్న ప్రధాన సమస్య.

ఇదీ చదవండి ➤ FAME 3: ఎలక్ట్రిక్‌ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం!

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్‌ అథారిటీ తెలిపింది. విద్యుత్‌ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్‌ రూలింగ్‌ సంస్థ పేర్కొంది. 

ఈ సందర్భంగా అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ అనేది విద్యుత్‌ విక్రయం కిందకు రాదని, దాన్ని సర్వీస్‌ కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. విద్యుత్‌ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలని, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)