Breaking News

కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్‌ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..

Published on Fri, 02/16/2024 - 11:46

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ( ESIC ) కిందకు డిసెంబర్‌ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్‌ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది.

కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్‌లో 47 ట్రాన్స్‌జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్‌ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్‌ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్‌లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8  లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్‌ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)