Breaking News

ఏఐ రంగంలో వెనుకపడ్డ గూగుల్.. కారణం ఇదే!

Published on Thu, 08/15/2024 - 10:36

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్‌లో టెక్ దిగ్గజం గూగుల్ వెనుకపడి ఉంది. దీనికి ప్రధాన కారణం రిమోట్ వర్క్ & కాంపిటీటివ్ డ్రైవ్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యమివ్వడమే అని గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆరోపించారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి స్టార్టప్‌లు ఏఐ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని వెల్లడించారు. అయితే గూగుల్ ఏఐ రంగంలో విజయం సాధించడం కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌, త్వరగా ఇంటికి వెళ్లడం & వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చాలా ముఖ్యమని గూగుల్ భావించిందని ఆయన అన్నారు.

2001 నుంచి 2011 వరకు గూగుల్ సీఈఓగా వ్యవహరించిన ఎరిక్ స్మిత్ వేగవంతమైన సాంకేతిక పరిశ్రమలో పోటీ పడేందుకు అవసరమైన విధానాలను గురించి వెల్లడించారు. ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి లేదా అనువైన షెడ్యూల్‌లను నిర్వహించడానికి అనుమతించడం వల్ల ప్రత్యర్థుతో పోటీ పడలేమని పేర్కొన్నారు.

గతంలో స్మిత్ ఆఫీస్ నుంచి పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సమర్థవంతమైన నిర్వహణను నిర్మించడానికి.. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది కీలకమని వాదించారు. అయిత్ గూగుల్ ప్రస్తుత పని విధానాలు స్మిత్ క్యారెక్టరైజేషన్‌కు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో చాలామంది ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)