Breaking News

సిప్‌ సూపర్‌హిట్‌

Published on Fri, 09/11/2026 - 04:54

న్యూఢిల్లీ: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఈక్విటీలకు ఆకర్షణ తగ్గడం లేదు. ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి (ఎంఎఫ్‌) రూ. 29,329 కోట్ల పెట్టుబడులు రావడం ఇందుకు నిదర్శనం. జూలైలో నమోదైన రూ. 24,697 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగడం ఇందుకు దోహదపడినట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సంఘం యాంఫీ గణాంకాల్లో వెల్లడైంది.

 ఇక సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లలో (సిప్‌) రిటైల్‌ పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. జూలైలో రూ. 31,961 కోట్ల పెట్టుబడులు రాగా ఆగస్టులో రూ. 32,297 కోట్లకు పెరిగాయి. గతేడాది ఆగస్టులో నమోదైన రూ. 28,265 కోట్లతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. తాజా గణాంకాలు కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో సిప్‌ల రూపంలో మొత్తం రూ. 1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచి్చనట్లయింది. 

దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకునేందుకు క్రమశిక్షణతో కూడుకున్న సాధనాలుగా ఫండ్స్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతోందని, సిప్‌ ఖాతాలు కీలకమైన 10.02 కోట్ల మైలురాయిని దాటడం ఇందుకు నిదర్శనమని యాంఫీ సీఈవో వెంకట్‌ చలసాని తెలిపారు. ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 66వ నెలా పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని పేర్కొన్నారు.  

సిప్‌ పెట్టుబడులు రికార్డు స్థాయిలో రావడం, పెట్టుబడులను నిలిపివేసే ధోరణి నెమ్మదిస్తుండటం మొదలైన అంశాలు భారతీయ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న క్రమశిక్షణను సూచిస్తోందని నిప్పన్‌ ఇండియా మ్యుచువల్‌ ఫండ్‌ ప్రెసిడెంట్‌ సౌగత చటర్జీ తెలిపారు. మార్చిలో మార్కెట్‌ దిగువ స్థాయి నుంచి మళ్లీ కోలుకున్నాక, మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ర్యాలీ కొనసాగిస్తుండగా, లార్జ్‌ క్యాప్స్‌ వెనుకబడినట్లు జర్మినేట్‌ ఇన్వెస్టర్‌ సరీ్వసెస్‌ సీఈవో సంతోష్‌ జోసెఫ్‌ తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరిగాయని పేర్కొన్నారు.  

యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. 
→ డెట్‌ ఆధారిత స్కీముల్లోకి పెట్టుబడుల రాక రివర్స్‌ కావడంతో ఆగస్టులో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ స్థాయిలోకి వచి్చన ఇన్వెస్ట్‌మెంట్స్‌ గణనీయంగా పడిపోయి రూ. 41,353 కోట్లకు పరిమితమయ్యాయి. n నికర ప్రవాహం తగ్గినప్పటికీ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఏయూఎం 1.5 శాతం పెరిగి రూ. 87.08 లక్షల కోట్లకు చేరింది.   
→ ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి నికరంగా రూ. 29,328.62 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యధికం. అప్పట్లో రూ. 38,440 కోట్లు వచ్చాయి. n ఈక్విటీల విభాగంలో స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ పటిష్టంగా ఉంటున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోకి దాదాపు రూ. 15,000 కోట్లు వచ్చాయి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ. 7,973 కోట్లు, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ. 6,989 కోట్లు, వచ్చాయి. 

→ గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)పై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగింది. వీటిలోకి జూలైలో రూ. 1,559 కోట్లు రాగా ఆగస్టులో రూ. 2,597 కోట్లు వచ్చాయి. ఇక సిల్వర్‌ ఈటీఎఫ్‌లలోకి కూడా నికరంగా రూ. 1,271 కోట్లు వచ్చాయి.  

Videos

ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్

ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

VIdeo: బ్యాంక్ ఉద్యోగులపై కారంపొడి కొట్టి..4 లక్షలు చోరీ

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)