Breaking News

రియల్టీలో భారీగా పెరిగిన పెట్టుబడులు: సీబీఆర్‌ఈ

Published on Tue, 10/15/2024 - 19:59

2024 జనవరి-సెప్టెంబ‌ర్‌ మధ్య కాలంలో దేశీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్‌ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్‌ డాలర్లు, 2020లో 6 బిలియన్‌ డాలర్లు, 2021లో 5.9 బిలియన్‌ డాలర్లు, 2022లో 7.8 బిలియన్‌ డాలర్లు, 2023లో 7.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు. రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌ – కమ్‌ – డెవలపర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, కార్పొరేట్‌ గ్రూప్‌లు, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్‌మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు.  
    
డేటా ప్రకారం జూన్‌ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశీ రియల్‌ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్‌ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్‌ఈ చైర్మన్‌ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్‌ లీజింగ్‌ మార్కెట్‌ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)