Breaking News

EPFO Update: ఆధార్‌ లేకుండానే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌!

Published on Sun, 12/01/2024 - 13:10

కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.

అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్‌మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్‌&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్‌ లేకుండా భారత్‌ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్‌ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. 

ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్‌ సొమ్ము!

వీరంతా ఆధార్ స్థానంలో పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్‌మెంట్‌ సొమ్మును నెఫ్ట్‌ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)