Breaking News

EPFO గుడ్‌న్యూస్‌.. కొత్త ‘విత్‌డ్రా ప్లాన్‌’కు ఆమోదం!

Published on Thu, 11/19/2026 - 18:05

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF) జమ చేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్‌ సొమ్మును ఒకేసారి ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేకుండా ఈపీఎఫ్‌వో కొత్త వెసులుబాటు కల్పించనుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ పొదుపులను విడతలవారీగా పొందేందుకు వీలుగా  సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)కు ఆమోదం తెలిపింది. దీంతో రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్‌లో మిగిలిన మొత్తంపై వడ్డీ పొందుతూ, క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన తాజాగా జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం ప్రారంభ దశలో రూ.5 లక్షలకు పైగా పీఎఫ్‌ నిల్వలు కలిగి, 55 ఏళ్లు దాటిన సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అంచనా.

మూడు రకాలుగా డబ్బులు పొందే అవకాశం

ఈ కొత్త విధానంలో సభ్యులకు ప్రధానంగా మూడు రకాల ఉపసంహరణ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.

1. విడతలవారీ ఉపసంహరణ: పీఎఫ్‌లోని మొత్తం పొదుపును నిర్ణీత వ్యవధిలో నెలవారీ లేదా ఇతర విడతల రూపంలో తీసుకోవచ్చు.

2. పాక్షిక ఉపసంహరణ: కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని, మిగిలిన సొమ్మును విడతలవారీగా పొందవచ్చు.

3. వడ్డీ మాత్రమే ఉపసంహరణ: అసలు మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలోనే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే తీసుకోవచ్చు.

సభ్యుల కుటుంబాలకూ ప్రయోజనం

ఈ పథకంలో డబ్బులు తీసుకుంటున్న సమయంలో సభ్యుడు మరణిస్తే, మిగిలిన పీఎఫ్‌ మొత్తాన్ని నామినీ లేదా మృతుడిపై ఆధారపడినవాళ్లు ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే గతంలో నిర్ణయించిన విధంగానే విడతలవారీ చెల్లింపులను కొనసాగించే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. అలాగే సభ్యులు తమ విత్‌డ్రా ప్లాన్‌ను మధ్యలో నిలిపివేసి, మిగిలిన మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త విధానం ద్వారా రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్‌ సొమ్మును నిర్వహించడం సులభం కానుంది. అయితే ఎంతకాలం పాటు విడతల చెల్లింపులు ఉంటాయి? కనీసం ఎంత మొత్తాన్ని ఖాతాలో ఉంచాలి? ఉపసంహరణలు ఏ రకమైన విడతల్లో ఉంటాయి? వంటి అంశాలపై ఈపీఎఫ్ఓ పూర్తి మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఉద్యోగి మరణించాక పెన్షన్‌ వచ్చేది వీళ్లకే.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)