Breaking News

ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన

Published on Tue, 06/24/2025 - 18:02

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అడ్వాన్స్ క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్‌ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల పెళ్లిల్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

‘కార్మికులకు నిరంతరాయంగా, సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు. ఆటో సెటిల్‌మెంట్‌ సదుపాయం కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది.

ఏమిటీ ఆటో సెటిల్‌మెంట్‌?

క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని కొంత భాగాన్ని అడ్వాన్స్‌గా పొందడానికి అనుమతించే విధానం. కొవిడ్‌ సమయంలో రూ.1లక్ష వరకు ఇలా ఆటో సెటిల్‌మెంట్‌కు ఈపీఎఫ​్‌ఓ అవకాశం ఇచ్చింది. ఇక నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు, ఇంటి రెన్యూవేషన్‌, పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్‌ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఈ విధానంలో నిధులు మ్యానువల్‌గా కాకుండా ఆటోమేటిక్‌గా అప్రూవ్‌ అవుతాయి.

ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ సమాచారం అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ పిల్లల వివాహం, విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్‌డ్రా చేసేందుకు అనుమతించారు. దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు.

ఆటో సెటిల్‌మెంట్‌ కోసం అర్హతలు

వైద్య అత్యవసర పరిస్థితులు: చందాదారులు లేదా తమపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరడం, పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం.

ఉన్నత విద్య: చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం.

వివాహ ఖర్చులు: చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు.

ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం: ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం.

ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ 68జే, 68కే, 68బీ ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. చందాదారు క్లెయిమ్‌ ఈపీఎఫ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది. అందుకు సాధారణంగా 72 గంటలు సమయం పడుతుంది.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి ‍వ్యాఖ్యలు

కావాల్సినవి..

  • చందాదారులు తప్పనిసరిగా ఫుల్‌ కేవైసీని అప్‌డేట్‌ చేయాలి. అందుకు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయాలి.

  • యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివ్‌గా ఉండాలి. దాన్ని వెరిఫై చేయాలి.

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)