Breaking News

EPFO Update: ఆ 12 అంకెల నంబర్‌ మిస్‌ అయిందా?

Published on Sun, 01/28/2024 - 19:49

నేటి జాబ్ మార్కెట్ చాలా వైవిధ్యంగా మారిపోయింది. ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుకుంటున్న తరుణంలో కంపెనీలు మారడం సాధారణమైపోయింది. ఈ మార్పుల మధ్య  ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. ఉద్యోగుల వృత్తిపరమైన ప్రయాణాల్లో ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఆధార్‌ నంబర్‌ మాదిరిగానే ఈపీఎఫ్‌వో ​​వ్యవస్థలో 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది చాలా కీలకమైనది. ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడల్లా ఈ నంబర్‌ మారదు. ఒకసారి ఈపీఎఫ్‌వో చేరినప్పుడు దీన్ని కేటాయిస్తారు. ఈపీఎఫ్‌ సంబంధిత అన్ని అంశాలకు ఈ యూఏఎస్‌ అవసరం ఉంటుంది. అయితే కంపెనీలు మారినప్పుడు కొంత ఉద్యోగులు ఈ యూఏఎన్‌ నంబర్‌ను మరిచిపోతుంటారు. ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నంబర్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో మరిచిపోయిన యూఏఎన్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌లోనే సులభంగా పొందే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది.

యూఏఎన్‌ ఇలా పొందండి..

  • ఈపీఎఫ్‌వో అధికారిక ​​వెబ్‌సైట్‌ (https://www.epfindia.gov.in/site_en/index.php)ను సందర్శించండి 
  • సర్వీసెస్‌ ట్యాబ్‌ కింద "ఫర్‌ ఎంప్లాయీస్‌" (For Employees) విభాగానికి వెళ్లి, "మెంబర్‌ UAN/ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTCP)" ఎంచుకోండి.
  • తర్వాత ఓపెన్‌ అయ్యే కొత్త పేజీలో కుడి వైపున ఉన్న ముఖ్యమైన లింక్‌ల కింద "నో యువర్‌ UAN"ని క్లిక్‌ చేయండి.
  • ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా అందించి ఆపై రిక్వెస్ట్‌ OTPని క్లిక్ చేయండి.
  • మీ మొబైల్‌కి వచ్చిన OTPని ధ్రువీకరించండి.
  • తర్వాతి పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, మెంబర్‌ ఐడీ, ఆధార్ లేదా పాన్ నంబర్, క్యాప్చా నమోదు చేసి "షో మై UAN"పై క్లిక్ చేయండి.
  • మీ UAN నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)