Breaking News

గుడ్‌న్యూస్‌: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు

Published on Tue, 06/27/2023 - 07:51

ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో అధిక పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ఈపీఎఫ్‌వో సభ్యులకు ఊరట లభించింది. అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు గడవును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడిగించింది. ఇది జూన్‌ 26తో ముగియాల్సి ఉండగా జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 

అధిక పింఛన్‌ను ఎంచుకునేందుకు ఈపీఎఫ్‌వో సభ్యులకు గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరోసారి పొడిగించింది. సభ్యులకు మరింత అవకాశం కల్పించేందుకు ఇంతకుముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్ 26 వరకు డెడ్‌లైన్‌ను పొడించుకుంటూ వచ్చింది. 

ఎవరు అర్హులు?
2014 సెప్టెంబరు 1 కంటే ముందు నుంచే  ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పింఛన్‌ పొందేందుకు అర్హులు. అలాగే  2014 సెప్టెంబరు 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే.

అవసరమైన పత్రాలు
అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సల్ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌), పెన్షనర్‌లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీవో), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్‌ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు అవసరమవుతాయి. 

అధిక పెన్షన్‌ను ఎలా లెక్కిస్తారు?
2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 12 నెలలలో కాంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిలో తీసుకున్న సగటు నెలవారీ వేతనం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన, విరమణ చేయబోయే ఉద్యోగులకు, సభ్యత్వం నుండి నిష్క్రమించే తేదీకి ముందు 60 నెలలలో  పొందిన సగటు నెలవారీ వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కకడతారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)