ఈపీఎఫ్‌ మొత్తం తీసేయాలంటే.. ఇక మూడేళ్లు ఆగాలి!

Published on Wed, 10/15/2025 - 15:25

మీకు ఉద్యోగం లేదా.. రాజీనామా చేసి చాలాకాలమైందా? మూడేళ్లు కూడా దాటిపోయిందా.. అయితే ఇక మీరు మీ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేసేసుకోవచ్చు. ఉద్యోగం లేకుండా ఉంటే రెండు నెలలు దాటగానే పీఎఫ్‌ అకౌంట్‌ను ఖాళీ చేసేందుకు ఇప్పటివరకూ అవకాశం ఉండగా... ఈపీఎఫ్‌ఓ బోర్డు తాజా నిర్ణయంతో అది మూడేళ్లకు పెరిగింది.

కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పును ఆమోదించింది.  ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) దీర్ఘకాలం పాటు ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే సభ్యులు తుది పరిష్కారాన్ని ఎంపిక చేసుకునేందుకు, భవిష్యనిధి ఖాతాలోని మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. 12 నెలలుగా ఉద్యోగం లేని వారు (పదవీ విరమణ కాలం తీరకముందే ) ఈపీఎఫ్‌ తుది పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

36 నెలల పాటు ఉద్యోగం లేకుండా కొనసాగితే అప్పుడు భవిష్యనిధితోపాటు పెన్షన్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని (EPF withdrawal) ఈపీఎఫ్‌వో ప్రకటించింది.  ప్రస్తుతం రెండు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. దీంతో చాలా మంది 2 నెలల తర్వాత ఖాతాను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది.

ఈపీఎఫ్‌ ఉపసంహరణలో కీలక మార్పులు

ఇక మూడు రకాల ఉపసంహరణలే..
ఇంతకుముందు, ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతించే 13 నిబంధనలు ఉండేవి. వీటన్నింటినీ విలీనం చేస్తూ కేవలం మూడు నిబంధనలను ఉంచాలని సీబీటీ నిర్ణయించింది. అవి అత్యవస పరిస్థితులు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు

100% వరకు విత్ డ్రాయల్స్
ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యాజమాన్యం వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్‌లోని అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.

మరిన్ని విత్ డ్రాలు
సీబీటీ  ఉపసంహరణ పరిమితులను సరళీకృతం చేసింది. విద్య సంబంధ అవసరాలకు ఇప్పుడు 10 సార్ల వరకు, వివాహం కోసం 5 సార్ల వరకు పీఎఫ్‌ ఉపసంహరించుకోవచ్చు. ఇవి గతంలో 3 సార్ల వరకే ఉండేవి.

12 నెలల తరువాత పాక్షిక ఉపసంహరణ
అన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీసం ఉండాల్సిన సర్వీస్‌ కాలాన్ని ఏకరీతిగా 12 నెలలకు తగ్గించారు.

ప్రత్యేక పరిస్థితులకు ఎలాంటి కారణం అవసరం లేదు
'ప్రత్యేక పరిస్థితులలో' పీఎఫ్‌ విత్‌డ్రా చేయాలంటే ఇంతకు ముందు కారణాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు, లాకౌట్లు / సంస్థల మూసివేత, నిరంతర నిరుద్యోగం, అంటువ్యాధి వ్యాప్తి మొదలైనవి సభ్యుడు స్పష్టం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, సభ్యుడు ఈ కేటగిరీ కింద ఎటువంటి కారణాలు పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.

25 శాతం కనీస బ్యాలెన్స్ తప్పనిసరి 
సభ్యుల ఖాతాలో 25% కాంట్రిబ్యూషన్‌ను కనీస బ్యాలెన్స్‌గా తప్పనిసరిగా  ఉంచాలని నిబంధన తీసుకొచ్చారు.

100% ఆటో సెటిల్‌మెంట్
సభ్యులకు ఎక్కువ సౌలభ్యం కల్పించేందుకు సెటిల్‌మెంట్‌ నిబంధనలను ఈపీఎఫ్‌వో సరళీకృతం చేసింది. ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, పాక్షిక ఉపసంహరణ కోసం క్లెయిమ్‌ల 100% ఆటో సెటిల్‌మెంట్‌ను ఈపీఎఫ్‌వో అనుసరించనుంది.

ముందస్తు ఫైనల్‌ సెటిల్‌మెంట్‌, పెన్షన్ ఉపసంహరణ
పదవీ విరమణ కాలం తీరకముందే ముందస్తు ఈపీఎఫ్  ఫైనల్‌  సెటిల్మెంట్‌ను పొందే వ్యవధిని ప్రస్తుతం ఉన్న 2 నెలల నుండి 12 నెలలకు, పైనల్‌ పెన్షన్ ఉపసంహరణను 2 నెలల నుండి 36 నెలలకు పెంచాలని సీబీటీ నిర్ణయించింది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపి కబురు.. చిగురించిన ఆశలు

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)