Breaking News

EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!

Published on Mon, 09/23/2024 - 13:43

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్‌ (ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్‌-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్‌ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్‌-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్‌ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని  అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. 

ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్‌-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్‌ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.

ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్‌బీఐ స్పషల్‌ స్కీమ్‌

'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్‌పీఎస్‌ మాదిరిగానే ఈపీఎస్‌ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్‌డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.

ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్‌  కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)