Breaking News

ఈపీఎఫ్‌ఓ ప్యానెల్‌లో మరో 15 బ్యాంకులు

Published on Sun, 04/06/2025 - 06:00

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించిన చెల్లింపులను స్వీకరించేందుకు కొత్తగా మరో 15 బ్యాంకులను ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) తమ ప్యానెల్‌లో చేర్చింది. దీంతో మొత్తం బ్యాంకుల నెట్‌వర్క్‌ 32కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమక్షంలో ఈపీఎఫ్‌వో, ప్రభుత్వ.. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫెడరల్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌ మొదలైనవి కొత్తగా ప్యానెల్‌లో చేరిన వాటిలో ఉన్నాయి.

 78 లక్షల పైచిలుకు పింఛనుదారులు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా పింఛన్లను పొందేందుకు కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. నవ భారత లక్ష్యం దిశగా దేశ పురోగతికి ఈపీఎఫ్‌ఓలాంటి సంస్థలు దోహదపడుతున్నాయని తెలిపారు. 8 కోట్ల మంది పైగా యాక్టివ్‌ సభ్యులు, 78 లక్షల మందికి పైగా పెన్షనర్లకు .. సంస్థ సామాజిక భద్రత ప్రయోజనాలను కలి్పస్తోందని ఆయన చెప్పారు. 2024–25లో 6 కోట్ల పైగా క్లెయిమ్‌లను సెటిల్‌ చేసిందని తెలిపారు. 2023–24లో నమోదైన 4.45 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం అధికమని మాండవీయ వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)