Breaking News

ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్.. ఇకపై ఆలస్యానికి చెక్

Published on Sat, 08/16/2025 - 16:21

లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్‌ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ.. ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది.

ఆగస్టు 13, 2025 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం.. UANలో సభ్యుని పేరు, లింగం, పుట్టిన తేదీ ఆధార్‌తో సరిగ్గా సరిపోలితే, యజమాని పోర్టల్‌లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్‌ను సీడ్ చేయవచ్చు. దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు.

UAN & ఆధార్ సీడింగ్
యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన 12 అంకెల ఐడెంటిఫైయర్. వ్యక్తి ఉద్యోగాలు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆధార్‌ను UANకి లింక్ చేయడం వలన సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు. కానీ ఆధార్ డేటా.. యూఐడీఏఐ ద్వారా ధృవీకరణ పొందాల్సిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి.

ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం

ఆధార్‌ లింక్ ఎలా?
ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి.. ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయలి.
➤తరువాత యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి. 
➤ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. 
➤ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. ఆధార్ నెంబరుకు లింక్ అయిన మొబైల్ & ఈమెయిల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. 
➤ఇవన్నీ పూర్తిగా తరువాత ఆధార్ UANతో లింక్ అవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)