Breaking News

ఈపీఎఫ్‌ వడ్డీ జమ.. ఈవారమే

Published on Wed, 07/09/2025 - 15:31

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్‌ అప్‌డేషన్‌ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్‌ 6 నుంచే వార్షిక ఖాతాల అప్‌డేషన్‌ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్‌–డిసెంబర్‌లో  వడ్డీ జమ జరిగింది.

వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..

  • స్టెప్ 1: ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ ( epfindia.gov.in )సందర్శించండి

  • స్టెప్ 2: అవర్‌ సర్వీసెస్‌ > ఫర్‌ ఎంప్లాయీస్‌ > మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లండి

  • లేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్‌ చేయండి.

  • స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  • స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.

  • స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండి

పాస్‌బుక్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)