Breaking News

ఆటోమేషన్‌తో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ వేగవంతం

Published on Sat, 11/01/2025 - 12:06

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. సభ్యులకు వారి నిధులను త్వరగా అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయమైన ముందడుగు వేసినట్లు చెప్పింది. EPFO అడ్వాన్సుల కోసం ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం సంస్థ ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో కీలకమని పేర్కొంది. ఈ పరిమితి పెంపు, ఆటోమేషన్ విధానం ద్వారా ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో వేగం, సామర్థ్యం పారదర్శకతను పెంచినట్లు ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో (30.10.2025 వరకు) మొత్తం EPF అడ్వాన్సు క్లెయిమ్‌లలో 71.22% ఆటోమేషన్‌ ద్వారా పరిష్కరించినట్లు చెప్పింది. అంతకుముందు సంవత్సరం ఇది 59 శాతంగా ఉందని స్పష్టం చేసింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్‌ అవుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా ఉందని తెలిపింది. ఆటోమేటెడ్ విధానంలో క్లెయిమ్‌లు నిర్దిష్ట అల్గారిథమ్‌లు, ప్రమాణాల ఆధారంగా ప్రాసెస్ అవుతాయి. తద్వారా వ్యక్తిగత ప్రమేయాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ విధానం సాగుతోంది.

క్లెయిమ్‌లు త్వరగా సెటిల్‌ కావడానికి కారణాలు

EPF క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం కావడానికి ప్రధాన కారణం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ఆటోమేట్ చేయడం సంస్థకు ఎంతో తోడ్పడిందటున్నారు. అందుకోసం ఈపీఎఫ్‌ఓ సాఫ్ట్‌వేర్ AI (కృత్రిమ మేధ), మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగిస్తుంది. క్లెయిమ్ దరఖాస్తులను సభ్యుని కేవైసీ వివరాలు (ఆధార్, బ్యాంకు ఖాతా), ఇతర ప్రమాణాలను ఇది స్వయంచాలకంగా ధ్రువీకరిస్తుంది.

పరిమితి (ప్రస్తుతం రూ.5 లక్షలు) లోపు ఉన్న, నిబంధనలకు అనువుగా ఉన్న అన్ని క్లెయిమ్‌లు మానవ ప్రమేయం లేకుండా సెటిల్ అవుతాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా సభ్యుని వివరాలు, KYC డాక్యుమెంట్లు, సర్వీస్ హిస్టరీ అన్నీ ఒకే వేదికపై అనుసంధానం అవుతాయి. క్లెయిమ్‌ల కోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫామ్-31 (అడ్వాన్స్), ఫామ్-19 (తుది సెటిల్‌మెంట్), ఫామ్-10C (పెన్షన్) అందుబాటులో ఉన్నాయి. ఇవి దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రూ.44 వేలకోట్లు రుణ మోసం

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)