Breaking News

EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్‌

Published on Sat, 11/23/2024 - 08:28

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.

క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్‌ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.

వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం.  

21 శాతం మహారాష్ట్ర నుంచే.. 
సెప్టెంబర్‌ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్‌–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్‌ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)