Breaking News

PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?

Published on Sat, 03/07/2026 - 14:40

2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.

ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్‌డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.

పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..
నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)