Breaking News

వడ్డీ సొమ్ము వచ్చిందా.. ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ చూసుకున్నారా?

Published on Sun, 06/29/2025 - 17:31

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ ఖాతాల్లో 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయడం ప్రారంభించింది. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి. దీనికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ పంపలేదు. కానీ చాలా మందికి ఇప్పటికే తమ పాస్ బుక్‌లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తోంది.

వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదం
గత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశంలో ఈపీఎఫ్‌పై ప్రతిపాదించిన  8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.

వడ్డీని ఎలా లెక్కిస్తారు?
ప్రతి నెలా ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. యజమాని వాటా కూడా 12 శాతం ఉంటుంది. అయితే ఇది పెన్షన్ పథకానికి 8.33%, ఈపీఎఫ్ ఖాతాకు 3.67% చొప్పున జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది. చక్రవడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు. ఇది ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్స్ రెండింటికీ వర్తిస్తుంది (పెన్షన్ భాగం మినహా). సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమవుతుంటుంది.

వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..

  • స్టెప్ 1: ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ ( epfindia.gov.in )సందర్శించండి

  • స్టెప్ 2: అవర్‌ సర్వీసెస్‌ > ఫర్‌ ఎంప్లాయీస్‌ > మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లండి

  • లేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్‌ చేయండి.

  • స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  • స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.

  • స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండి

పాస్‌బుక్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోతే..
కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్ బుక్‌లో ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కొన్ని రోజులు వేచి చూసి మళ్లీ తనిఖీ చేయండి. అప్పటికీ కనిపించకపోతే ఆన్‌లైన్లో లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)