Breaking News

ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్‌ అయిందా?

Published on Fri, 07/17/2026 - 12:53

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నుంచి తమ సొంత ఈపీఎఫ్ నిధులను విత్‌డ్రా లేదా బదిలీ చేసుకోవాలని భావించే చందాదారుల క్లెయిమ్ కొన్నిసార్లు  రిజెక్ట్‌ అవుతోంది. ఆన్‌లైన్ ప్రక్రియలు సులభతరం అయినప్పటికీ సాంకేతిక, రికార్డుల లోపాల వల్ల క్లెయిమ్‌లు తిరస్కరిస్తున్నట్లు అధికారిక డేటా స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సాధారణ కారణాలు, వాటిని అధిగమించే మార్గాలు కింద చూద్దాం.

1. వ్యక్తిగత వివరాల వ్యత్యాసం

ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, ఈపీఎఫ్ఓ డేటాబేస్‌లో ఉన్న మీ పేరు, తండ్రి పేరు లేదా పుట్టిన తేదీల్లో చిన్న అక్షర దోషం ఉన్నా క్లెయిమ్ వెంటనే తిరస్కరణకు గురవుతుంది.

పరిష్కారం: మీ యజమాని(ఎంప్లాయర్‌) సహకారంతో జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.

2. బ్యాంక్ వివరాలు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారడం

ఇటీవలి కాలంలో కొన్ని బ్యాంకుల విలీనం కారణంగా పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు చెల్లకుండా పోయాయి. అలాగే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ ఖాతా సంఖ్య లేదా పేరు తప్పుగా ఉన్నా క్లెయిమ్ క్యాన్సిల్ అవుతుంది.

పరిష్కారం: యూఏన్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి లేటెస్ట్ ఐఎఫ్ఎస్‌సీ, సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాలి.

3. కంపెనీని వీడిన తేదీ అప్‌డేట్ చేయకపోవడం

ఉద్యోగి పాత సంస్థను వీడిన తేదీని యజమాని పోర్టల్‌లో నమోదు చేయకపోతే ఆ ఉద్యోగి ఇంకా అక్కడే పని చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ భావిస్తుంది. దీనివల్ల ఫైనల్ సెటిల్‌మెంట్ క్లెయిమ్ నిలిచిపోతుంది.

పరిష్కారం: ఉద్యోగం వదిలేసిన రెండు నెలల తర్వాత మెంబర్ పోర్టల్‌లో ‘మార్కెట్‌ ఎగ్జిట్‌’ ఆప్షన్ ద్వారా ఉద్యోగి స్వయంగా ఈ తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు.

4. కేవైసీ పూర్తి కాకపోవడం

యూఏన్ ఖాతాతో ఆధార్, ప్యాన్ కార్డులు లింక్ కాకపోవడం లేదా వెరిఫై కాకపోవడం క్లెయిమ్ రిజెక్షన్‌కు ప్రధాన కారణం. ఐదేళ్ల సర్వీస్ కంటే తక్కువ ఉండి ప్యాన్ లింక్ చేయకపోతే టీడీఎస్‌ వర్తిస్తుంది.

పరిష్కారం: మీ ఆధార్‌ను యూఏన్‌తో సీడింగ్ చేసి కేవైసీని పూర్తి చేయాలి.

5. ఒకటి కంటే ఎక్కువ యూఏన్ నంబర్లు ఉండటం

వేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పుడు వేర్వేరు యూఏన్ నంబర్లు సృష్టించి ఉంటాయి. పాత నిధులను కొత్త ఖాతాలోకి బదిలీ చేయకుండా (మెర్జ్‌ చేయకుండా) నేరుగా విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.

పరిష్కారం: మీ పాత పీఎఫ్ ఖాతాలను ప్రస్తుతమున్న యాక్టివ్ యూఏన్ నంబర్‌కు బదిలీ చేయాలి.

6. ఈపీఎస్ పెన్షన్ అర్హత సమస్యలు

పదవీ విరమణ నిధులు క్లెయిమ్ చేసేటప్పుడు ఫారమ్ 19 (ఈపీఎఫ్‌ విత్‌డ్రా), ఫారమ్ 10C (పెన్షన్ విత్‌డ్రా)లలో తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.

పరిష్కారం: సర్వీస్ కాలపరిమితిని బట్టి సరైన ఫారమ్‌లను ఎంచుకోవాలి.

7. నిబంధనల ఉల్లంఘన, అసంపూర్ణ డాక్యుమెంటేషన్

ప్రీ-మెచ్యూర్ లేదా అడ్వాన్స్ విత్‌డ్రా (ఉదాహరణకు అనారోగ్యం, వివాహం, ఇల్లు కొనుగోలు) కొరకు దరఖాస్తు చేసేటప్పుడు నిర్దేశిత కనీస సర్వీస్ కాలపరిమితి లేకపోవడం లేదా స్పష్టత లేని క్యాన్సిల్డ్ చెక్కులను అప్‌లోడ్ చేయడం వల్ల క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి.

పరిష్కారం: అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్లు, పాస్‌బుక్ లేదా చెక్కులపై మీ పేరు, ఖాతా సంఖ్య స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర!

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)