Breaking News

మెటా ఇండియా-యూఎస్‌ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్

Published on Sat, 02/15/2025 - 12:38

గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌ను కలిపే సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు మెటా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుంది.

‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’గా పిలిచే ఈ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టు భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతుంది. మెటా అప్లికేషన్లు, సర్వీసులను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తవుతుందని అంచనా వేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు రావడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్‌లు

సాంకేతిక పురోగతి

కంపెనీ ‘రూటింగ్‌’ అనే కొత్త సాంకేతికత ద్వారా 7,000 మీటర్ల సముద్ర లోతులో కేబుళ్లను ఏర్పాటు చేస్తారని మెటా ప్రతినిధి తెలిపారు. షిప్ లంగర్‌లు, ఇతర ప్రమాదాల నుంచి నష్టాన్ని నివారించడం కోసం హైరిస్క్ ఫాల్ట్ ప్రాంతాల్లో మెరుగైన టెక్నిక్‌లు ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక ఆవిష్కరణ ఇండియాలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సదుపాయాలకు, సర్వీసులకు మద్దతు ఇవ్వడానికి, వాటిలో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)