Breaking News

గేమింగ్‌ సంస్థల డిపాజిట్లు ఫ్రీజ్‌

Published on Tue, 11/25/2025 - 00:27

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలకు చెందిన రూ. 523 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఇటీవల రియల్‌ మనీ గేమింగ్‌ని నిషేధించిన తర్వాత ఆ మొత్తాన్ని ప్లేయర్లకు రిఫండ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు తమ దగ్గరే అట్టే పెట్టుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. విన్‌జో, గేమ్స్‌క్రాఫ్ట్‌ తదితర గేమింగ్‌ కంపెనీల డిపాజిట్లు వీటిలో ఉన్నాయి. 

మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా నవంబర్‌ 18–22 మధ్య ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లోని నిర్దేశ నెట్‌వర్క్స్‌ (ఎన్‌ఎన్‌పీఎల్‌), గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ (జీటీపీఎల్‌), విన్‌జో గేమ్స్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రియల్‌ మనీ గేమ్స్‌లో (ఆర్‌ఎంజీ) మనుషులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఆడుతున్న విషయాన్ని కస్టమర్లకు తెలియనివ్వకుండా విన్‌జో అనైతిక వ్యాపార విధానాలు అమలు చేసిందని, క్రిమినల్‌ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ ఆరోపించింది. గేమర్లకు రిఫండ్‌ చేయాల్సిన మొత్తాన్ని తమ ఖాతాల్లో అట్టే పెట్టుకుందని పేర్కొంది. గేమ్స్‌క్రాఫ్ట్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలున్నట్లు వివరించింది.  

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు