Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐలు తగ్గుతాయ్‌...

Published on Wed, 05/07/2025 - 21:14

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే  0.15% తగ్గించింది.

ఈ సవరణ తరువాత,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు  9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్‌లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.

రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?
ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్‌ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు
ఓవర్‌నైట్‌: 9.00%
1 నెల: 9.00%
3 నెలలు: 9.05%
6 నెలలు: 9.15%
1 సంవత్సరం: 9.15%
2 సంవత్సరాలు: 9.20%
3 సంవత్సరాలు: 9.20%

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)