Breaking News

కొలువులకు కొత్త టెక్నాలజీల దన్ను

Published on Wed, 01/01/2025 - 01:22

ముంబై: కొత్త సాంకేతికతల దన్నుతో దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం నూతన సంవత్సరంలోనూ జోరుగా వృద్ధి బాటలో ముందుకు సాగనుంది. 2025లో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం పెరగనుంది. మానవ వనరుల సేవల సంస్థ ఫస్ట్‌మెరీడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సీఈవో (ఐటీ స్టాఫింగ్‌) సునీల్‌ నెహ్రా ఈ విషయాలు తెలిపారు. డిజిటల్‌ పరివర్తన వేగవంతం కావడం, కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరగడం వంటి అంశాల కారణంగా 2024లో దేశీ ఐటీ, టెక్‌ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు 17 శాతం పెరిగినట్లు చెప్పారు.

కొత్త సంవత్సరంలోనూ పరిశ్రమ వృద్ధి మరింత పుంజుకోగలదని పేర్కొన్నారు. అప్లికేషన్‌ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డెవాప్స్‌ ఇంజినీర్లు, ఏఐ, ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు ఉద్యోగావకాశాలు బాగుంటాయని నెహ్రా చెప్పారు. 2024లో ప్రధాన ట్రెండ్‌గా నిల్చిన కృత్రిమ మేథ (ఏఐ) 2025లో కూడా మరింత వేగవంతమవుతుందన్నారు. డేటా అనలిస్టులు, డేటా ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు తదితర నిపుణులకు డిమాండ్‌ ఉంటుందని పేర్కొన్నారు. 

జెన్‌–ఏఐలో పది లక్షల అవకాశాలు.. 
2028 నాటికి జెనరేటివ్‌ ఏఐ (జెన్‌–ఏఐ) పరిశ్రమలో 10 లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి ఇది గణనీయంగా తోడ్పడగలదని నెహ్రా తెలిపారు. జెనరేటివ్‌ ఏఐ ఇంజినీర్, అల్గోరిథం ఇంజినీర్, ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌ వంటి ఉద్యోగాలకు వేతనాలు గణనీయంగా పెరగవచ్చని పేర్కొన్నారు. మిడ్‌–లెవెల్‌ ఉద్యోగులకు వేతన వృద్ధి 25–30 శాతం శ్రేణిలో ఉంటుందని వివరించారు.

వ్యాపారాలు వృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసే కొద్దీ నూతన ప్రాజెక్టుల కోసం హైరింగ్‌ చేసుకోవడం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకునేందుకు పోటీపడటం మొదలైన ధోరణులు పెరుగుతాయని తెలిపారు.  2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) 6,00,000 ఉద్యోగాలు వచ్చినట్లు నెహ్రా చెప్పారు. 2030 నాటికి ఈ నిపుణుల సంఖ్య 25 లక్షల నుంచి 28 లక్షల వరకు పెరుగుతుందన్నారు.  

మరిన్ని విశేషాలు.. 
⇒ 2025లో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్‌), టెలికం వంటి టెక్‌యేతర రంగాల్లో కూడా ఐటీ/టెక్నాలజీ నిపుణుల నియామకాలు పెరుగుతాయి. మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి సంస్థల వరకు చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు కేటాయించే బడ్జెట్లు సగటున 15–20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అంతేగాకుండా ఉద్యోగులు సైతం కొత్త తరం టెక్‌ కొలువులకు కావాల్సిన నైపుణ్యాలను సాధించేందుకు తమంతట తాముగా కూడా చొరవ తీసుకుంటారు. 

⇒ దేశీ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 2.4 కోట్ల స్థాయికి చేరుతుంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న అవసరాలను పరిష్కరించుకునేందుకు, కావాల్సినప్పుడు అందుబాటులో ఉండే వర్కర్లపై ఆధారపడే ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. 

⇒ భారతీయ ఐటీ రంగం చాలా మటుకు స్థిరపడినప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి వర్ధమాన రంగాల్లో నిపుణుల కొరత ఉంటోంది. అలాగే, అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరత ప్రభావం కూడా మన ఐటీ రంగంపై పడతోంది.  

⇒ డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియాలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగానే ఉంటున్నాయి. కానీ, వ్యయాలపరంగా ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు, కస్టమర్లకు మరింత విలువైన సేవలు అందించేందుకు వినూత్న వ్యూహాలు అవసరమవుతాయి. సాంకేతిక పరివర్తనకు సంబంధించి మరింతగా ముందుకెళ్లేందుకు ఇవి కీలకంగా ఉంటాయి.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)