Breaking News

యాపిల్‌ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్‌.. ఎందుకంటే..

Published on Tue, 06/11/2024 - 10:19

ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్‌ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్‌మస్క్‌ హెచ్చరించారు. ఈమేరకు మస్క్‌ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌ చేశారు.

కాలిఫోర్నియాలోని యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్‌ ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్‌మస్క్‌ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘ఓపెన్‌ఏఐని యాపిల్‌ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్‌ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్‌కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్‌ఏఐ యాపిల్‌ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్‌చేశారు.

కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్‌లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్‌ క్లౌడ్‌లో ఫైర్‌వాల్‌ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్‌కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.

ఇదీ చదవండి: టెన్షన్‌ పడుతూ లవ్‌ప్రపోజ్‌ చేసిన సుందర్‌పిచాయ్‌

2015లో ఎలొన్‌మస్క్‌, సామ్‌ఆల్ట్‌మాన్‌ కలిసి ఓపెన్‌ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్‌ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్‌ఆల్ట్‌మాన్‌పై మస్క్‌ దావా వేశారు. ఓపెన్‌ఏఐకి పోటీగా, చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కు ప్రత్యామ్నాయంగా మస్క్‌ ఎక్స్‌ఏఐను రూపొందించారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)