Breaking News

మస్క్‌ జాబ్‌ ఆఫర్‌.. వేతనం ఎంతంటే..

Published on Wed, 03/26/2025 - 14:30

ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని ఎక్స్ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్ అభివృద్ధికి, దాని విశ్వసనీయతను పెంచడానికి ప్రతిభావంతులైన బ్యాకెండ్‌ ఇంజినీర్ల కోసం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు వివిధ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, ఉద్యోగ పోస్టింగ్ వివరాలు ఓపెన్ఎఐ చాట్‌జీపీటీ, గూగుల్ జెమినితో పోటీపడటానికి మెరుగైన కృత్రిమ మేధను నిర్మించాలని ఎక్స్‌ చేస్తున్న ప్రయత్నాలను హైలైట్‌ చేస్తుంది.

ఎక్స్ఏఐ సహ వ్యవస్థాపకుడు, టెక్‌ ఇంజినీర్ ఇగోర్ బాబుష్కిన్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్‌లో ‘గ్రోక్ పనితీరును మెరుగ్గా, మరింత విశ్వసించేదిగా మార్చేందుకు సహాయపడటానికి అద్భుతమైన బ్యాకెండ్‌ ఇంజినీర్లు ​​కావాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఎక్స్ఏఐ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుందని చెప్పిన మస్క్..‘రాజకీయంగా సరైనదైనా.. కాకపోయినా నిజంపైనే దృష్టి సారించిన ఏకైక ప్రధాన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ. సత్యానికి కట్టుబడి ఉండటమే సురక్షితమైన కృత్రిమ మేధను నిర్మించడానికి ఏకైక మార్గం’ అన్నారు.

బ్యాకెండ్‌ ఇంజినీర్‌ ఏం చేస్తారు..?

కంపెనీ ఉత్పత్తి సేవల పనితీరును నిర్వహించాలి. ప్రొడక్ట్, రీసెర్చ్ టీమ్‌లు సృజనాత్మక ఏఐ ఉత్పత్తులు, మోడళ్లను తయారు చేసేందుకు సాంకేతికంగా వీలుకల్పించాలి. అధిక పనితీరు కలిగిన మైక్రోసర్వీసెస్ రూపొందించాలి. కోడింగ్‌, నిర్వహణ, ఉత్పత్తి, పరిశోధన బృందాలతో సహకరించాలి. బ్యాకెండ్‌ సమస్యలను పరిష్కరించాలి.

ఇదీ చదవండి: మెసేజ్‌ స్క్రోల్‌ చేస్తే జాబ్‌ పోయింది!

వేతనం ఎంతంటే..

ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో రెజ్యూమె సబ్మిట్‌ చేయడంతోపాటు 15 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూ, కోడింగ్ అసెస్‌మెంట్‌, సిస్టమ్స్ హ్యాండ్-ఆన్, ప్రాజెక్ట్ డీప్-డైవ్, టీమ్ మీట్‌ ఉంటుంది. తదుపరి టెక్నికల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగానికి వార్షిక వేతన శ్రేణి 1,80,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) నుంచి 4,40,000 డాలర్లు(రూ.3.77 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఉద్యోగార్థుల నైపుణ్యాలను అనుసరించి మారే అవకాశం ఉంటుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)