Breaking News

అంబానీకి కాల్‌ చేస్తాను: మస్క్‌

Published on Wed, 10/16/2024 - 15:12

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్‌ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్‌ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్‌ అంబానీ, ఇలొన్‌మస్క్‌ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల​్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్‌ స్పందించారు.

ఎక్స్‌లో డోజీ డిజైనర్‌ అనే హ్యాండిల్‌ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్‌ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్‌ అంబానీకి ఇలొన్‌మస్క్‌ అంటే ఎందుకంత భయం? మస్క్‌ స్టార్‌లింక్‌ ముఖేశ్‌ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్‌ చేశారు. దీనిపై మస్క్‌ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్‌నెట్‌ సేవలందించేందుకు స్టార్‌లింక్‌ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్‌ చేసి అడుగుతాను’ అని అన్నారు.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్‌ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్‌ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్‌టెల్‌ అధికారులు కూడా మస్క్‌ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)