Breaking News

మస్క్‌ భారత పర్యటనకు డేట్‌ ఫిక్స్‌.. ఏం జరగబోతుందంటే..

Published on Thu, 04/11/2024 - 10:03

అమెరికాలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్‌ ఎలొన్‌ మస్క్‌ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్‌ చేశారు. మస్క్‌ పర్యటనకు డేట్‌ కూడా ఫిక్స్‌ అయిందని, ఏప్రిల్‌ 22న భారత్‌ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది.

ప్రధానితో భేటీలో భాగంగా భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్‌ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్‌ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్‌​ మస్క్‌ భారత్‌ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది.

ఇదీ చదవండి: వాట్సప్‌, టెలిగ్రామ్‌ బాటలోనే ట్రూకాలర్‌.. కొత్త ఫీచర్‌ ప్రారంభం

ఏం జరగబోతుంది..

కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్‌ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్‌ కంపెనీలు, వైరింగ్‌ పరిశ్రమలోని కంపెనీలు, టైర్‌ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్‌లో తయారీ ప్లాంట్‌ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్‌ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)