Breaking News

మస్క్ 'ఎక్స్ టీవీ'.. యూట్యూబ్‌కు గట్టి పోటీ!

Published on Tue, 09/03/2024 - 20:08

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఏది చేసిన ఓ సంచలనమే. ట్విటర్ కొనుగోలు చేసి అందులో ఊహకందని మార్పులు చేశారు. ఆఖరికి పేరు, లోగో అన్నీ మార్చేసి 'ఎక్స్' అని నామకరణం చేశారు. ఇప్పుడు 'ఎక్స్ టీవీ'గా కూడా పరిచయం చేశారు.

ఎక్స్ టీవీ అనేది ఒక యాప్. చాలాకాలంగా మస్క్ కలలు కంటున్న ఈ ఎక్స్ స్మార్ట్ టీవీ యాప్‌ మొత్తానికి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాప్‌లో సినిమాలు, లైవ్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ఇది గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఎక్స్ టీవీ యాప్ అనేది కేవలం ఆండ్రాయిడ్ టీవీలైన ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టార్, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎలా పని చేస్తుంది? దీనిని యూజర్లు ఇష్టపడతారా? లేదా అనే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి పరిణామాలు జరుగుతాయి.

ఇప్పటికే ఎక్స్ టీవీ యాప్‌లో పలువురు వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనిని కొంతమంది వినియోగదారులకు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది.

ఎక్స్ టీవీ యాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్‌, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ (72 గంటల వరకు షోను స్టార్ చేసుకోవచ్చు), స్టార్ట్‌ఓవర్ టీవీ (లైవ్ షో స్టార్టింగ్ నుంచి ప్రారంభించడానికి అనుమతిస్తుంది), ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి