Breaking News

ఈవీఎంలు రద్దు చేయాలి: మస్క్ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 06/16/2024 - 11:36

ప్రపంచంలోని చాలాదేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు. అదృష్టవశాత్తూ, పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్‌లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు.

రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు.

మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అబ్రిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా.. అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమం అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)