Breaking News

గుజరాత్ సమ్మిట్‌లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?

Published on Fri, 01/12/2024 - 10:27

భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు.

నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్‌కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్‌ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్

ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)