Breaking News

‘ఓపెన్‌ఏఐ పుట్టిందే ఓ అబద్ధంతో..’

Published on Sat, 10/11/2025 - 15:08

ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAIని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కంపెనీ దాని వ్యవస్థాపక లక్ష్యానికి పూర్తిగా ద్రోహం చేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్‌ ద్వారా మస్క్ OpenAI ‘ఒక అబద్ధంపై నిర్మించబడింది. ఒక స్వచ్ఛంద సంస్థగా వెలసి సొంత ఆర్థిక లాభం కోసం పని చేస్తుంది’ అని పేర్కొన్నారు.

మస్క్ తాజా దాడి నేపథ్యం

OpenAI ఇటీవల తన వైరల్ టెక్స్ట్-టు-వీడియో అప్లికేషన్ ‘సోరా’ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనిపై వస్తున్న పోస్ట్‌లకు ప్రతిస్పందనగా మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.

2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు.

ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)