Breaking News

భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్‌వర్త్‌ ఎంతంటే?

Published on Tue, 12/16/2025 - 14:43

టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.

స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.

మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)