Breaking News

అపరకుబేరుడు ఎలోన్‌ మస్క్‌కి భారీ షాక్‌

Published on Tue, 03/05/2024 - 09:12

ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్‌ వరల్డ్‌ రిచెస్ట్‌ బిలియనీర్‌ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. 

టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ 200 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్‌ నెట్‌వర్త్‌ 198 బిలియన్లుగా ఉంది.

అంత వేతనం వదులు కోవాల్సిందే
టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్‌ మస్క్‌ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని  55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్‌ టోర్నెట్టా.. డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్‌ కోర్టు విచారణ చేపట్టింది.

తాజాగా మస్క్‌ 55 బిలియన్‌ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్‌ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ కుబేరుల‍్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు.

పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు 
దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్‌లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌కి కలిసి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)