Breaking News

లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్‌' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్

Published on Sat, 08/26/2023 - 17:43

ఎలాన్ మస్క్ గత కొంత కాలం నుంచి 'టెస్లా సైబర్‌ట్రక్' (Tesla Cybertruck) గురించి చెబుతూనే ఉన్నాడు. 2019లో ఈ కారుని ఆవిష్కరించినప్పటికీ.. ఇప్పటి వరకు లాంచ్ గురించి అధికారిక వివరాలు పంచుకోలేదు. అయితే గతంలో చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాగా ఇప్పుడు టెక్సాస్‌లోని గిగా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్-స్పెక్ సైబర్‌ట్రక్‌ డ్రైవ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోను మస్క్ షేర్ చేశారు.

ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిక్ టెస్లా సైబర్‌ట్రక్‌ ప్రొడక్షన్-స్పెక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇది చూడటానికి డెల్టా ఆకారంలో ఉండే మిర్రర్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.

ఇప్పటికి మస్క్ ఈ సైబర్ ట్రక్ ఫోటోలను షేర్ చేయడం రెండవ సారి. అంటే ఇది త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సైబర్‌ట్రక్ కేవలం నేల మీద మాత్రమే కాకుండా నీటిలో కూడా బోట్ మాదిరిగా ప్రయాణిస్తుంది గతంలో మస్క్ వెల్లడించాడు.

ఇదీ చదవండి: లాక్మే కంపెనీకి లక్ష్మీదేవికి సంబంధమేంటి? స్వాతంత్య్రం వచ్చిన తరువాత..

ఇది వాటర్ ప్రూఫ్ కారు. కావున నీటిలో ప్రయాణించేటప్పుడు కూడా ఎలాంటి అవరోధాలు గురి కాకుండా ఉంటుంది. అంతే కాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ కారుకంటే కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఇండియాకు వస్తుందా? రాదా? అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)