Breaking News

FAME-3: ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?

Published on Mon, 12/18/2023 - 10:54

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్‌’ (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్‌ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్‌ మూడో విడత (ఫేమ్‌-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. 

ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’

ఆర్థిక శాఖ వ్యతిరేకత
దేశంలోని ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్‌-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి.

ఇప్పటికే సబ్సిడీలో కోత
ఫేమ్‌-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్‌-2 స్కీములో ఎలక్ట్రిక్‌  వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)