Breaking News

ఎలక్ట్రిక్‌ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్‌ దాసరి 

Published on Mon, 07/31/2023 - 17:03

బెంగళూరుకు చెందిన మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ట్రెసా మోటర్స్ బోర్డు ఛైర్మన్‌గా వినోద్ కె దాసరిని నియమించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో వినోద్‌కు ఉన్న విశేష అనుభవం తమ కంపెనీ దేశీయ మార్కెట్‌లో పట్టు సాధించడంతోపాటు అంతర్జాతీయ వ్యాపార అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుందని ట్రెసా మోటార్స్‌ విశ్వసిస్తోంది. 

ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్న వారికి షాక్‌! డిస్కౌంట్‌ డబ్బు వెనక్కి కట్టాలి?

వినోద్‌ దాసరి గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓగా, అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీగా పనిచేశారు. అపెక్స్ ఇండస్ట్రీ బాడీ ఎస్‌ఐఏఎంకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో ఆటోకార్ ప్రొఫెషనల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ట్రెసా మోటర్స్‌  చైర్మన్‌గా వినోద్‌ దాసరి నియామకం తక్షణమే అమల్లోకి రానుంది.  ట్రెసా మోటర్స్‌లో కీలక బాధ్యతలను చేపట్టనున్న ఆయన కంపెనీ వ్యూహాత్మక దిశానిర్దేశం, ఆవిష్కరణలను నడపడంలో కీలకంగా వ్యవహరించనున్నారు.

ట్రెసా మోటార్స్ కుటుంబానికి వినోద్ కె దాసరిని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ అన్నారు. ఆటోమోటివ్ రంగంలో వినోద్‌ విశేష అనుభవం, అద్భుతమైన విజయాలు తమ కంపెనీ వృద్ధి ప్రయాణానికి కీలక వనరులుగా మారుతాయని, ఆయన నాయకత్వంలో ట్రెసా మోటర్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రెసా మోటర్స్ ఛైర్మన్‌గా తన నియామకంపై  వినోద్ కె దాసరి మాట్లాడుతూ, ట్రెసా మోటార్స్‌లో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు.

ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో వర్తింపు  

ట్రెసా మోటర్స్‌ కంపెనీని 2022లో రోహన్ శ్రవణ్, రవి మచాని స్థాపించారు. పారిశ్రామిక డిజైన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ సంబంధిత టెక్నాలజీలో ఈ కంపెనీకి విశేష సామర్థ్యం ఉంది. ఇది ప్రస్తుతం 18T-55T GVW విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. దాని మొదటి వాహనం మోడల్ V0.1ని ఇటీవలె ఆవిష్కరించింది. అధికారిక ఉత్పత్తి లాంచ్ 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరగనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)