Breaking News

ఎలక్ట్రిక్‌ కార్ల జోరు.. రానున్న రోజులు ఈవీలవే..

Published on Sun, 07/20/2025 - 10:46

కొత్త మోడల్స్‌ ఎంట్రీతో పాటు రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (ఆర్‌ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్‌ఎడ్జ్‌ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్‌ఎడ్జ్‌ అడ్వైజరీ అండ్‌ రీసెర్చ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

దేశీయంగా 2022 క్యాలెండర్‌ ఇయర్‌లో 5,151గా ఉన్న పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాల్లో ఫోర్‌ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)