Breaking News

ఐపీవోకు ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ 

Published on Fri, 09/05/2025 - 04:46

న్యూఢిల్లీ: విత్తనాలు, సస్య రక్షణ రంగ కంపెనీ ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 

వీటిలో రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని శ్రీనివాసరావు లింగ, రూ. 160 కోట్ల విలువైన షేర్లను ఉషా రాణి పాపినేని ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ. 1,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. శ్రీకర్‌ సీడ్స్‌ బ్రాండుతో కార్యకలాపాలు విస్తరించిన తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 

విత్తనాలుసహా సమీకృత సస్య రక్షణ సొల్యూషన్లు అందించే కంపెనీ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా విభిన్నతరహా హైబ్రిడ్, స్వీయ పరాగ సంపర్క(ఓపీవీ) విత్తనాలను పంపిణీ చేస్తోంది. జొన్న, ధాన్యం, పత్తి, గోధుమలు, సజ్జలు తదితర పంటల సంబంధ విత్తనాలను ఆఫర్‌ చేస్తోంది. 2025 జూన్‌కల్లా సీఐబీఆర్‌సీ నుంచి 269 రిజి్రస్టేషన్లు పొందింది. గతేడాది(2024–25)లో రూ. 441 కోట్ల ఆదాయం, రూ. 71 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)