భారత్‌లో వ్యాపారంపై ఈఎఫ్‌టీఏ ఇన్వెస్టర్ల దృష్టి 

Published on Thu, 02/06/2025 - 06:00

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్‌ దేశాల కూటమి ఈఎఫ్‌టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్‌కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 

2024లో ఈఎఫ్‌టీఏ, భారత్‌ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, నార్వే, లీష్‌టెన్‌స్టెయిన్, స్విట్జర్లాండ్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్‌ వాచీలు, చాక్లెట్లు, కట్‌.. పాలిష్డ్‌ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.  

24 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం.. 
ఈఎఫ్‌టీఏ–భారత్‌ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌కు స్విట్జర్లాండ్‌ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్‌ నుంచి 2024 సెప్టెంబర్‌ మధ్య కాలంలో స్విట్జర్లాండ్‌ నుంచి 10.72 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.  వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్‌టీఏ బ్లాక్‌ .. ఇందులో 50 బిలియన్‌ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్‌లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.   
 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)