Breaking News

డీమెర్జర్‌ వేళ, వేదాంతకు ఎదురు దెబ్బ : ఈడీ దాడులు

Published on Tue, 06/02/2026 - 13:20

ప్రముఖ వ్యాపార సంస్థ వేదాంతకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాకిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత (Vedanta) గ్రూప్ ప్రాంగణాల్లో జూన్ 2న సోదాలు నిర్వహిస్తోంది. రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేదాంత గ్రూప్ తన ప్రస్తుత వ్యాపారాన్ని ఐదు విభిన్న విభాగాలుగా విభజించే (డీమెర్జర్) ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. 

అనిల్ అగర్వాల్ సుప్రీం కోర్టులో అదానీని సవాలు చేసిన ఒక నెల తర్వాత, ఈడీ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌పై దాడులు నిర్వహించడం గమనార్హం.  వేదాంత తన మాతృ సంస్థ  వేదాంత రిసోర్సెస్‌కు చెల్లించిన రాయల్టీ చెల్లింపుపై జరుగుతున్న దర్యాప్తులో భాగమే ఈ దాడులు. ముంబై, ఢిల్లీలలోని వేదాంత కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వేదాంత లిమిటెడ్ తన మాతృ సంస్థ అయిన 'వేదాంత రిసోర్సెస్' (Vedanta Resources) కు చేసిన రాయల్టీ చెల్లింపులపై వస్తున్న ఆరోపణల విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. 

ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభమై ఇప్పుడు ముగిసిందని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. దర్యాప్తు అధికారులు ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, రికార్డులను సేకరించారు. ఫెమా కింద ఉన్న విదేశీ మారకపు నిబంధనలకు అవి అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 11:45 గంటల సమయంలో వేదాంత షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ. 334.6 వద్ద ట్రేడ్ అయింది.

వేదాంత స్పందన
ఈడీ దాడులపై వేదాంత స్పందించింది. అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, చట్టపరిధిలో అన్ని నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది  ప్రస్తుతం ఈ వ్యవహారం నియంత్రణ సంస్థల (Regulatory Process) పరిశీలనలో ఉన్నందున, ఇంతకుమించి  వ్యాఖ్యానించలేమని వేదాంత ప్రతినిధి ఒకరు తెలిపారు.

వేదాంత vs అదానీ
మరోవైపు భారతదేశపు ఏకైక ఫార్ములా వన్ సర్క్యూట్‌తో సహా పలు ఆస్తులను కలిగి ఉన్న దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) కోసం గౌతమ్ అదానీ గ్రూప్ వేసిన విజేత బిడ్‌ను, మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ సవాలు చేయగా, కంపెనీ లా అప్పీల్స్ కోర్టు  (మే 4, 2026న) తిరస్కరించింది.  వేదాంత లేవనెత్తిన అంశాలలో యోగ్యత లేదని భావించిన జాతీయ కంపెనీ చట్ట అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT), దాని రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఇలా సవాల్‌ చేసింనందుకే ఈడీ దాడుల అని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

 కాగా బ్రిటన్‌కు చెందిన 'వేదాంత రిసోర్సెస్' దీనికి మాతృ సంస్థ (Parent Company). ఈ విదేశీ మాతృ సంస్థ భారీగా అప్పుల్లో మునిగిపోయింది. నివేదికల ప్రకారం.. వేదాంత రిసోర్సెస్ మొత్తం అప్పు రూ. 74,000 కోట్లుగా ఉంది. ఇందుకోసమే భారతీయ అనుబంధ సంస్థ (Vedanta Ltd) తన మాతృ సంస్థకు భారీగా రాయల్టీలు చెల్లిస్తూ వస్తోంది. వేదాంత లిమిటెడ్ అనేది భారతదేశంలో లిస్ట్ అయిన కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంది.

మే నెలలో ఈ కంపెనీ వ్యాపార విభజనకు సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల నుండి అనుమతులు పొందింది. దీని ప్రకారం, కొత్తగా నాలుగు సంస్థలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ ప్రధాన సంస్థ అలాగే కొనసాగుతుంది. ఇందులో హిందుస్థాన్ జింక్, జింక్ ఇంటర్నేషనల్, కాపర్, ఫెర్రో క్రోమ్ మరియు కొత్త టెక్నాలజీ వ్యాపారాలు ఉంటాయి.  అల్యూమినియం కార్యకలాపాలు, పవర్ ప్లాంట్లు మరియు బాల్కో (BALCO) లో 51 శాతం వాటాను ఇది నిర్వహిస్తుంది.

వేదాంత పవర్ (Vedanta Power) తల్వాండి సాబో ప్లాంట్‌తో సహా థర్మల్ పవర్ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. వేదాంత ఆయిల్ & గ్యాస్ (Vedanta Oil & Gas): కేయిర్న్ ఆయిల్ & గ్యాస్ (Cairn Oil & Gas) బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వేదాంత స్టీల్ & ఫెర్రస్ (Vedanta Steel & Ferrous): ఇనుప ఖనిజం గనులు మరియు ఈఎస్ఎల్ (ESL) స్టీల్ ప్లాంట్‌ను ఇది నిర్వహిస్తుంది.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి