Breaking News

పేటీఎంకు ఈడీ నోటీస్‌

Published on Tue, 03/04/2025 - 04:27

న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం మాతృ సంస్థ ‘వన్‌ 97 కమ్యూనికేషన్స్‌’కు (ఓసీఎల్‌) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్‌97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్‌ శేఖర్‌ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్‌ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు  నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌ ఈ నోటీసు జారీ చేశారు.

 నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్‌ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్‌బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్‌ సబ్సిడరీ అయిన లిటిల్‌ ఇంటర్నెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది.  

పేటీఎం షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% పడి,  ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది.   

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)