Breaking News

దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు

Published on Thu, 02/22/2024 - 13:28

కొవిడ్‌ సమయంలో ఎడ్యుకేషన్‌ రంగంలో బైజూస్‌ ఓ వెలుగు వెలిగింది. భారీగా నియామకాలు చేపట్టింది. క్రమంగా కరోనా భయాలు తొలగడంతో కార్యకలాపాలు భారంగా మారి అప్పుల్లోకి వెళ్లినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దాంతో ఆ కంపెనీ లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని ఇతర సంస్థలు నోటీసులు సైతం పంపిచాయి. తాజాగా ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. 

దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్‌ ఇంటిమేషన్‌ లుకౌట్‌ సర్క్యులర్‌’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదు.

మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్‌ మీటింగ్‌(ఈజీఎం)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్త బోర్డును ఎన్నుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. దానికోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. అయితే వాటాదారుల కోరికను సవాలు చేస్తూ బైజూస్‌ కర్ణాటక హైకోర్టులో సంప్రదించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని చెప్పింది.

ఇదీ చదవండి: కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..

ఫ్రాన్స్‌ కంపెనీ పిటీషన్‌ దాఖలు చేయడంతో బైజూస్‌ సంస్థ ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి నోటీసులు అందుకుంది. ఇదిలా ఉండగా, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్‌ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్‌-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్‌ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్‌.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)