Breaking News

1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద

Published on Thu, 03/21/2024 - 04:24

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలుగా (2000 తొలి నాళ్ల నుంచి) భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. 2022–23 గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయాల్లో 22.6 శాతం వాటా, అలాగే సంపదలో 40.1 శాతం వాటా కేవలం ఒక్క శాతం ప్రజలదే ఉంటోంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలతో పోలి్చనా ఇది చాలా ఎక్కువ. ’1922–2023 మధ్య కాలంలో భారత్‌లో ఆదాయ, సంపద అసమానతలు: పెరిగిన బిలియనీర్ల రాజ్యం’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం ముఖ్యంగా 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో కొందరి వద్దే అత్యధికంగా సంపద కేంద్రీకృతమవ్వడమనేది మరింతగా పెరిగింది. థామస్‌ పికెటీ (ప్యారిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌), లూకాస్‌ చాన్సెల్‌ (హార్వర్డ్‌ కెనెడీ స్కూల్,  వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌), నితిన్‌ కుమార్‌ భారతి (న్యూయార్క్‌ యూనివర్సిటీ, వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌) ఈ నివేదికను రూపొందించారు. నికర సంపద దృష్టికోణం నుంచి చూస్తే భారత ఆదాయపు పన్ను వ్యవస్థ తిరోగామి విధానంగా అనిపించవచ్చని నివేదిక పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆదాయం, సంపదను పరిగణనలోకి తీసుకునేలా పన్ను విధానాన్ని పునర్‌వ్యవస్థీకరించడం, ఆరోగ్యం.. విద్య..పౌష్టికాహారంపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కేవలం సంపన్న వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా గ్లోబలైజేషన్‌ ప్రయోజనాలను పొందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే అసమానతలపై పోరాడేందుకు 2022–23లో అత్యంత సంపన్నులుగా ఉన్న 167 కుటుంబాలపై 2 శాతం ‘సూపర్‌ ట్యాక్స్‌‘ని విధిస్తే దేశ ఆదాయంలో 0.5 శాతం మేర సమకూరగలదని, సామాన్య ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండే పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా వెసులుబాటు లభించగలదని నివేదిక వివరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)