Breaking News

భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..

Published on Mon, 07/13/2026 - 14:51

భారతదేశం పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కొన్ని వాహన తయారీ సంస్థలు కూడా ఇథనాల్ వినియోగానికి సరిపడే వెహికల్స్ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇప్పటికే మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేశాయి. ఈ బైక్‌లు E20 నుంచి E85 వరకు (20% నుంచి 85% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనం) ఉపయోగించగలవు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లకు కంపెనీలు ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చాయి. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న నాలుగు ఈ85 బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ ప్లస్
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీని ధర రూ. 82,710 (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ స్ప్లెండర్ మోడల్ ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఇంధన వ్యవస్థ, ఇంజిన్ నిర్వహణ, కొన్ని విడిభాగాల్లో మార్పులు చేశారు. ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా స్ప్లెండర్ మాదిరిగానే 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది కూడా E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. ఈ బైక్ ధర రూ. 72,792 (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చవకైన ఈ85 మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250
సుజుకి సంస్థ కమ్యూటర్ విభాగానికే మాత్రమే కాకుండా.. ప్రీమియం సెగ్మెంట్‌లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అందించింది. ఇందులో భాగంగానే కంపెనీ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకును ఇథనాల్‌తో పనిచేసాల రూపొందించింది. ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ.2,00,896 (ఎక్స్ షోరూమ్).

యమహా ఎఫ్‌జెడ్ బ్లూ
యమహా కంపెనీ జూలై 2026లో ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడల్‌ను లాంచ్ చేయడంతో.. భారత ఫ్లెక్స్ ఫ్యూయల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఎఫ్‌జెడ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మితమైంది. ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగలదు. ఇందులో 149 సీసీ సింగిల్ సిలిండర్ బ్లూ కోర్ ఇంజిన్ అమర్చారు. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్).

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)